కోడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాలలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..

కొడిమ్యాల అక్టోబర్ 10 నవ వెలుగు :

జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. పితృ అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన 8రోజులు వివిధ పేర్లతో బతుకమ్మ వేడుకలు జరుపుకొని ఈరోజు చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలను మహిళలు ఆడపడుచులు యువత ఎంతో వేడుకగా జరుపుకున్నారు ఈ సందర్భంగా గత రెండు రోజుల నుండి వివిధ రకాల పూలను సేకరించి ఈరోజు వాటిని బతుకమ్మలుగా పేర్చి తీరక పూలతో బతుకమ్మలను సుందరంగా తీర్చిదిద్ది ఒకరికొకరు పోటీలు పడి మరి బతుకమ్మలను చాలా సుందరంగా బతుకమ్మలను పేర్చినారు వివిధ గ్రామాలలోని మహిళలు ఆడపడుచులు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు ఇందుకుగాను గత మూడు రోజుల నుండి పల్లెలలో పండగ వాతావరణం నెలకొంది బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలు యువత ఆడపడుచులు కొత్త వస్త్రాలను ధరించి ఆడపడుచులందరూ ఎంతో ఉత్సాహంతో డీజేచప్పుల మధ్య కోలాటాలతో, ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. అనంతరం చెరువులలో నిమజ్జనం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు